ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"లైగర్" థియేటర్లలో నాగ్ "ది ఘోస్ట్" ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 25, 2022, 12:01 PM

ప్రపంచవ్యాప్తంగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది "లైగర్" మూవీ. షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే... లైగర్ థియేటర్లలో కింగ్ నాగార్జున కొత్త మూవీ "ది ఘోస్ట్" ట్రైలర్ ప్రదర్శింపబడుతోంది. ఈ విషయంపై మేకర్స్ ముందుగా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఒకరకంగా ఇది ఆడియన్స్ ను థ్రిల్ చేసింది. దీంతో లైగర్ మూవీ చూసిన వాళ్ళు ప్రత్యేకంగా ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ట్రైలర్ కట్ చేసిన విధానం, కింగ్ నాగ్ పవర్ఫుల్ అండ్ స్టైలిష్ పెర్ఫార్మన్స్, యాక్షన్ సీక్వెన్సెస్... ఇలా ఈ ట్రైలర్ ఇప్పటివరకు ఎలాంటి అంచనాలు లేని సినిమాపై భారీ అంచనాలను ఏర్పరిచింది. పోతే, ఈ రోజు సాయంత్రం 5:04 గంటలకు యూట్యూబులో ఈ ట్రైలర్ విడుదల కాబోతుంది.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో కింగ్ నాగ్, సోనాల్ చౌహన్ జంటగా నటించిన ఈ చిత్రం హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa