ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోరు జారిన రాఖీ సావంత్ పై రూ 10 కోట్ల‌కు దావా వేసిన త‌నుశ్రీ‌

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 22, 2018, 11:33 AM

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా మీటూ ఉద్యమంలో భాగంగా నటుడు నానా పాటేకర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు చేసిన నేప‌థ్యంలో త‌నుశ్రీ‌కి వ్య‌తిరేకంగా నటి రాఖీ సావంత్ పలు ఆరోపణలు చేసింది. తనుశ్రీ డ్రగ్స్ తీసుకుని వ్యాన్‌లో ఉండగా, తాను ,నానా పాటేకర్ సలహా మేరకు ఒక సాంగ్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. ‘ఆరోజు తనుశ్రీ డ్రగ్స్ తీసుకుని వ్యాన్‌లో 4 గంటల పాటు స్పృహ లేకుండా పడివుంది. ఈరోజు పెద్దపెద్ద కబుర్లు చెబుతున్న తనుశ్రీ అసలు బాగోతం బయపెట్టాలనుకుంటున్నాను. ఆ పాట నేను పూర్తి చేసినందుకు తనుశ్రీ నాకు నోటీసు కూడా పంపించింది. అయితే సినిమా యూనిట్ నన్ను కాపాడింది’ అని పేర్కొంది..అయితే ఈ ఆరోప‌ణ‌లను తీవ్రంగా ఖండించిన త‌నుశ్రీ ఆ వెంట‌నే రాఖీపై రూ. 10 కోట్ల మేరకు పరువునష్టం దావా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa