దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట ఆ వేడుక ఎప్పుడు జరుగుతుందనే విషయమై సస్పెన్స్ కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఎట్టకేలకు వివాహ తేదీని ప్రకటించారు. తమ పెళ్లి తేదీని ప్రకటిస్తూ రణవీర సింగ్-దీపిక పదుకోన్ అభిమానులకు ఓ లేఖ విడుదల చేశారు. రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. నవంబర్ 14, 15 తేదీల్లో వివాహ వేడుక జరుగనున్నట్లు అందులో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa