జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశాడు.
'ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే చస్తార్రా చచ్చిపోతార్రా అన్న తనికెళ్ల భరణి డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. కట్ చేస్తే జైల్లో ఉన్న హీరో నేను చస్త సర్, పవన్ కల్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే నేను చచ్చిపోత సర్ అని సమాధానం ఇస్తాడు . మరో సీన్‌లో ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం టికెట్లు తెస్తానని తను ప్రేమించే అమ్మాయి దగ్గర పోజు కొడతాడు హీరో. మరోవైపు ఈ పిచ్చి అలవాటుని మాన్పించాలని తాపత్రయపడుతున్నాడు అతడి తండ్రి పాత్ర పోషించిన తనికెళ్ల భరణి. మొత్తానికి ట్రైలర్ అయితే సరదాగా కొనసాగగా ఉంది ఈ ట్రైలర్ ప్రేక్షకుల మోములపై నవ్వులు పూయిస్తోంది.అని డైరక్టర్ చెపుతారు .