కరోనావైరస్ మహమ్మారి దేశంలో అలజడి సృష్టించిన సమయంలోదేశం లో అన్ని రవాణా నిచిపోవడం తో తమ సొంత ప్రాంతాలకు వేళ్ళ లేని వారికీ నటుడు సోనూ సూద్ మానవత్వంతో స్పందించాడు. వేలాది మందికి అండగా నిలిచారు వారిని తమ సొంత ప్రాంతాలకు పంపటానికి అంతో కృషి చేశారు అప్పటి నుంచి మొదలైన సేవాకార్యక్రమాలు పరంపర నేటికీ కొనసాగిస్తున్న ఉన్నాడు. తన స్వచ్ఛంద సంస్థ సూద్ ఛారిటీ ఫౌండేషన్‌తో కలిసి చురుకుగా పని చేస్తున్నాడు. ఆసవరమైన వారికి నేను ఉన్నానంటూ భరోసా ఇస్తూ ఆర్ధిక సాయం అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ స్టూడెంట్ రిపోర్దర్ గా మారి తమ పాఠశాలలో ఉన్న సమస్యల వీడియో సోనూ సూద్ దృష్టికి చేరుకుంది. స్కూల్ ఆవరణలో ఉన్న సమస్యలను పదిమందికి తెలిసేలా వివరిస్తూ.. రిపోర్టింగ్ తో వైరల్ అయిన సర్ఫరాజ్ అనే స్టూడెంట్ చదువు బాధ్యతలను సోనూ తీసుకున్నాడు.జార్ఖండ్ లోని గొడ్డా జిల్లాలోని మహ్గామా బ్లాక్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్లక్ష్యానికి గురవుతూ.. అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు. పాఠశాలకు రాని ఉపాధ్యాయులు , కనీస సదుపాయాలకు కరువుఅయిన నేపథ్యంలో స్కూల్ లో చదువుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో సర్పరాజ్ అనే 12 ఏళ్ల స్టూడెంట్ రిపోర్టర్ అవతారం ఎత్తాడు. ఓ ప్లాస్టిక్ బాటిల్‌కు కర్ర తగిలించి మైక్ తరహాలో తయారు చేశాడు. ఆ మైక్ ను పట్టుకుని తోటి విద్యార్థులను ఇంటర్వ్యూ చేస్తూ.. స్కూల్ ఆవరణలో ఉన్న సమస్యలను పదిమందికి తెలిసేలా వివరించాడు. ఈ రిపోర్టింగ్ తో సర్ఫరాజ్ వైరల్ అయ్యాడు. దీనిని చూసిన సోనూసూద్ తాజాగా స్పందించారు. సర్ఫరాజ్ చదువు కోసం ముంబయిలో అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.