సూపర్ స్టార్ రజినీకాంత్, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కాంబోలో 1999లో వచ్చిన "నరసింహ" (తమిళ్ లో పడయప్పా) బాక్సాఫీస్ వద్ద ఎంతటి భీకర ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నరసింహ కు ముందు ఒక సినిమా, తరువాత మరొక సినిమాలో కల్సి నటించిన ఈ జంట దాదాపు ఇరవై ఏళ్ళ తరవాత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న "జైలర్" లో రమ్యకృష్ణ నటిస్తుందంటూ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ప్రస్తుతానికి రమ్యకృష్ణ సపోర్టింగ్ రోల్స్ చేస్తుంది. మరి ఈ సినిమాలో రమ్యకృష్ణ రజినీకి జోడిగా నటిస్తుందా లేక విలన్ గానా, లేక సపోర్టింగ్ రోల్ లో నటిస్తుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
పోతే, ఈ చిత్రంలో మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కూడా ఒక కీ రోల్ లో నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.