విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు ఇప్పుడుఅయన పాత ప్రాజెక్ట్స్‌ను కొత్తగా చూపించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఏవేవో కారణాలతో మధ్యలో ఆగిపోయిన చాలా సినిమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా లైన్‌లోకి వస్తున్నాయి. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఆయన ప్రాజెక్ట్స్ఆ నాలుగు సినిమాలు ఇప్పుడు పట్టాలెక్కాయి.
విక్రమ్ సూపర్ హిట్ అన్న టాక్ వినిపించగానే.. గత రెండేళ్లుగా వాయిదాపడుతూ వచ్చిన ఇండియన్ 2 వర్క్ రీస్టార్ట్ అయ్యింది. మరోసారి వందలకోట్ల వసూళ్లతో లోకనాయకుడు సత్తా చాటడంతో బిగ్ బడ్జెట్‌తో ఇండియన్ 2ను రూపొందించేందుకు ముందుకు వచ్చారు మేకర్స్. శంకర్ దర్శకత్వంవహిస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ ముహుర్తం పూజా కార్యక్రమం బుధవారం 24 ఆగస్టు నిర్వహించారు.
అదే సమయంలో కమల్ డైరెక్షన్‌లోనే స్టార్ట్ చేసిన శభాష్ నాయుడు సినిమాను కూడా రీస్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ రాఘవన్. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ప్లాన్ ఎప్పటి నుంచో ఉంది. ప్రజెంట్ కమల్ మంచి ఫామ్‌లో ఉండటంతో రాఘవన్ సీక్వెల్‌కు ఇదే పర్ఫెక్ట్ టైమ్ అని ఫీల్ అవుతున్నారట మేకర్స్.
వీటితో పాటు మరికొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. మొత్తానికి విక్రమ్ హిట్‌తో కమల్ స్టామినా మీద మేకర్స్‌కు నమ్మకం కుదిరినట్లుంది. దీంతో ఆయనతో మూవీస్ కోసం పోటీపడుతున్నారు