ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విక్రమ్ 'ధృవ నచ్చతిరమ్' పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 26, 2022, 05:05 PM

గౌతమ్ మీనన్‌ దర్శకత్వంలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ అధికారకంగా ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ధృవ నచ్చతిరమ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, చాలా కాలంగా వాయిదా పడిన ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుందని సమాచారం. ఇదే విషయాన్ని దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తాజాగా ఒక మీడియా ఛానెల్‌కి తెలిపారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని మేకర్స్ వెల్లడించారు. స్పై థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో జాతీయ భద్రతా ఏజెన్సీ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్లస్ లో  విక్రమ్ టీమ్ హెడ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, పార్తీబన్, సిమ్రాన్, రాధిక, దివ్య దర్శిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa