విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "హిట్: ది ఫస్ట్ కేస్". హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపురనేని నిర్మించిన ఈ సినిమా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కి సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇదే టైటిల్ తో హిందీలో రీమేకై అక్కడ కూడా మంచి విజయం సాధించింది.
ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ను తీసుకు రాబోతున్నారు మేకర్స్. ఫస్ట్ కేసు లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, సెకండ్ కేసు లో అడివిశేష్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతానికైతే సెకండ్ కేసు మూవీ షూటింగ్ సెట్స్ పై ఉంది. ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ లోపు థర్డ్ కేసు పై ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. శైలేష్ కొలను థర్డ్ కేసును కూడా తెరకెక్కిస్తారని, అందులో స్వయంగా నానినే హీరోగా నటిస్తారని, ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ తెరకెక్కబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇదేకనక జరిగితే, ఈ సినిమాతో నాని బాలీవుడ్ డిబట్ ఖాయమైనట్టే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa