శర్వానంద్ నటిస్తున్న బై లింగువల్ మూవీ "ఒకేఒక జీవితం" (తమిళ్ లో "కణం")నుండి కొంచెంసేపటి క్రితమే థర్డ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. 'మారిపోయే జీవితం' అనే ఈ పాటను కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ పాడారు. అంతేకాక ఈ పాటలో నటించారు కూడా. జెక్స్ బిజోయ్ స్వరపరిచిన ఈ పాటకు కృష్ణ చైతన్య లిరిక్స్ అందించారు.
చాన్నాళ్ల తరువాత అక్కినేని అమల నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కార్తీక్ డైరెక్టర్. రీతూవర్మ, ప్రియదర్శి, న్నెల కిషోర్ , నాజర్, ఆలీ తదితరులు నటిస్తున్నారు.
డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై SR ప్రకాష్ బాబు, ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa