నైట్రో స్టార్ సుధీర్ బాబు వెండితెరపై కనిపించి చాన్నాళ్ళే అయ్యింది. ఐతే, రాబోయే కాలంలో సుధీర్ బాబు నటించిన సినిమాలు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మామా మశ్చీంద్ర వరసగా విడుదలై, ప్రేక్షకులను అలరించనున్నాయి.
ఈ రెండు సినిమాలు ఇంకా విడుదల కాకముందే సుధీర్ బాబు నుండి మరొక సినిమా ఎనౌన్స్మెంట్ రాబోతుంది. సుధీర్ బాబు కెరీర్ లో పదహారవ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఆగస్టు 28వ తేదీన రాబోతుంది. ఆ రోజున మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రివీల్ కాబోతుంది.
పోతే, ఈ సినిమాకు మహేష్ డైరెక్టర్ కాగా, భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.