వేసవి అంటే దాదాపు మార్చి నుంచి ఆరంభమవుతుంది. ఆ వేసవి కోసం నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’ చిత్రం మార్చి 30న రిలీజ్ కానుంది. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘నేను లోకల్’ చిత్రం తర్వాత నాని, కీర్తీ సురేష్ జోడీగా నటిస్తున్న చిత్రం ఇది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినివను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. చిరంజీవి హీరోగా మోహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’ చిత్రం రపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలి పాత్రను కీర్తీ సురేష్ చేస్తున్నారు. అనిల్ సుంకర, రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఇక హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడో సినిమ రపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తారు. ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమ వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా షటింగ్ ఇంకా ఆరంభం కాలేదు. సెప్టెంబరు లేదా అక్టోబరు మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందట.