ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదిసాయికుమార్ "క్రేజీఫెలో" సెన్సార్ పూర్తి

cinema |  Suryaa Desk  | Published : Sun, Aug 28, 2022, 11:07 PM

టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయికుమార్ నట వారసుడిగా 2011లో వెండితెరకు పరిచయమయ్యాడు ఆది సాయికుమార్. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం "క్రేజీ ఫెలో". సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఫణికృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
లేటెస్ట్ గా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు క్లీన్ యూ/ ఏ సెర్టిఫికెట్ ఇచ్చారు. దిగాంగాన సూర్యవన్షి, మిర్ణా మీనన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధ్రువ సంగీతం అందిస్తున్నారు.
విభిన్న కథాకథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీతోనైనా ఆది సాయికుమార్ మళ్ళీ విజయాల బాట పట్టాలని, దాదాపు పదేళ్ల నుండి వరసగా పరాజయాలతోనే కాలం గడుపుతున్న ఆది ఈ సినిమాతో గ్రాండ్ సక్సెస్ కావాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa