వేసవిలో విదేశాలకు వెళ్లి సేదదీరే సెలబ్రెటీలు ప్రస్తుతం వర్షాకాలంలో వెళ్తున్నారు. ఈ జాబితాలో కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ చేరింది. తన ప్రియుడు రాజవేల్‌తో కలిసి ఇటీవలే ఆమె విదేశాలకు వెళ్లింది. ధనుష్, శింబు, జయం రవి సరసన ప్రస్తుతం ఆమె సినిమాలు చేస్తోంది. అంతేకాకుండా ఇండియన్-2లోనూ ఆమె నటించనుంది. ఇంత బిజీ షెడ్యూల్‌లో షూటింగ్ గ్యాప్ తీసుకుని, ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది.