లైగర్ ప్రమోషన్స్‌లో యాటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడాడు. అతడి చేష్టల వల్ల మేము నష్టపోయాం. అతడు కొండ కాదు అనకొండ.. అంటూ నానామాటలు అన్నాడు ప్రముఖ మల్టీప్లెక్స్, థియేటర్ మరాఠా మందిర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్. అయినా రౌడీ హీరో ఇవేమీ పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. తాజాగా అతడు ముంబైకి వెళ్లి మనోజ్ దేశాయ్‌ను కలిసి తాను ఏం మాట్లాడాడో వివరించాడు. అతడితో మాట్లాడిన తర్వాత మనోజ్ తన విమర్శలు తప్పని తెలుసుకుని హీరోకు సారీ చెప్పాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'విజయ్ దేవరకొండ మాట్లాడిన దాంట్లో చిన్న బిట్ మాత్రమే నాకు ఎవరో పంపారు. అది చూసి నేను అతన్ని విమర్శించాను. విజయ్ నన్ను కలిసి తానేం మాట్లాడాడో పూర్తి వీడియో చూపించాడు. అతనిపై అనవసరంగా విమర్శలు చేశానని సారీ చెప్పాను. అతని లైగర్ సినిమాకు వసూళ్లు బాగున్నాయి. ఇలాగే కష్టపడి కెరీర్‌లో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా' అన్నారు. ఇక వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.ఇందులో విజయ్ మొఖం లో మనోజ్ తనను తిట్టాడు అన్న కోపం కనిపించలేదు మనస్పర్థలను తొలగించేందుకు విజయ్ ఇలా కలిశారు అని అభిమానులు అభిప్రాయపడగా మరొకరు మాత్రం ఇదంతా పెద్ద డ్రామాలా కనిపిస్తోంది అని అంటున్నారు.