త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేశ్ బాబు కాంబినేషన్‌లోఎస్ ఎస్ ఎమ్ బి 28 అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజాల వంటి చిత్రాల వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుండటంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్ హీరోలు, హీరోయిన్స్‌ని తీసుకుంటాడు. తాజాగా మహేశ్ బాబు సినిమా కోసం లవర్ బాయ్ తరుణ్‌ని తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. వరుస పరాజయాలతో కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమయిన తరుణ్ మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా తరుణ్ హీరోగా నటించిన నువ్వే నువ్వే మూవీతోనే త్రివిక్రమ్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించగా మళ్లీ ఇన్నాళ్లకు ఆయన దర్శకత్వంలో తరుణ్ కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa