ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ 'రావణాసుర' మూవీ గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 29, 2022, 09:00 PM

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ యువ దర్శకుడు సుధీర్ వర్మతో కలిసి 'రావణాసుర' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్ అండ్ పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్రకారం, రావణాసుర మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో 5 కోట్ల రూపాయల భారీ సెట్‌లో ప్రారంభమైంది. ప్రొడక్షన్ డిజైనర్ డిఆర్‌కె కిరణ్ పర్యవేక్షణలో ఈ భారీ సెట్‌ను నిర్మించారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు సమాచారం. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయ ప్రకాష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ అండ్ ఆర్‌టి టీమ్‌వర్క్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa