సీతారామం సినిమాతో తెలుగు అభిమానుల మనసు కొట్టేసిన బాలీవుడ్ తార మృణాల్ ఠాకూర్ కు ఇప్పుడు సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తన అందం, అభినయంతో మృణాల్ అందరినీ అక్కట్టుకుంది. తెలుగులో తనకు డిమాండ్ పెరగడంతో మృణాల్ రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసింది. ప్రస్తుతం కోటీ రూపాయల వరకు పారితోషకం డిమాండ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. తెలుగులో తన రెండో సినిమాను కూడా మృణాల్ వైజయంతి బ్యానర్లోనే చేయనుంది.