సుధీర్ బాబు, యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా, ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి". సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో సినిమా నుండి ఒక్కొక్కటిగా లిరికల్ సాంగ్స్, వీడియో గ్లిమ్స్ రిలీజ్ అవుతున్నాయి. తాజాగా 'ఆ మెరుపేమిటో' అనే లిరికల్ సాంగ్ కు సంబంధించిన ప్రోమో వీడియో రిలీజ్ అయ్యింది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించగా, లేట్ సిరివెన్నెల గారు సాహిత్యమందించారు. ఈ పాట పూర్తిగా ఈ రోజు సాయంత్రం 4:05గంటలకు రిలీజ్ కాబోతుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతమందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa