ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బన్నీపై మనసు పడ్డ పంజాబీ బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 26, 2018, 04:34 PM

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రెడ్ బస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా రెడ్ బస్ కొత్త యాడ్ చిత్రీకరణ చేశారు. ఆ యాడ్ లో అల్లు అర్జున్ తో పాటు బాలీవుడ్ ముద్దుగుమ్మ మోడల్ పరుల్ గులాటి నటించింది. ఆ సందర్బంగా బన్నీతో తీసుకున్న ఒక సెల్ఫీని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పంజాబీ ముద్దుగుమ్మ బన్నీపై ప్రశంసల జల్లు కురిపించింది. బన్నీ గురించి ఆయన డాన్స్ గురించి పరుల్ గులాటి ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది.


యాడ్ లో బన్నీతో డాన్స్ చేసే అవకాశం ఈమెకు దక్కలేదు. అయినా కూడా బన్నీ డాన్స్ గురించి మాట్లాడటం ద్వారా ఈమె ఇంకా ఏదో ఆలోచనలో ఉందా అనిపిస్తుంది. బన్నీతో ఈమె సినిమా ఛాన్స్ ను ఆశిస్తుందేమో బన్నీ తో కాకున్నా సౌత్ లో ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బన్నీ గురించి ఈమె కామెంట్స్ చేసి ఉంటుందని అనిపిస్తుంది. బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం కొత్తేం కాదు. ముఖ్యంగా పంజాబీ ముద్దుగుమ్మలు టాలీవుడ్ ను ఏలేశారు ఏలుతూనే ఉన్నారు.


పంజాబ్ ముద్దుగుమ్మలు ఛార్మి రకుల్ ప్రీత్ సింగ్ - తాప్సిలు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్నారు. వారి దారిలోనే పరుల్ గులాటి కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ గుర్తింపును దక్కించుకుంటుందేమో చూడాలి. ఉత్తరాది నుండి టాలీవుడ్ కు హీరోయిన్స్ దిగుమతి అవ్వడం కొత్తేం కాదు. త్వరలోనే పరుల్ గులాటి కూడా తెలుగు ఇండస్ట్రీకి దిగుమతి కాబోతుందేమో చూడాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa