ఆగస్టు 25వ తేదీన విడుదలైన కింగ్ నాగార్జున "ది ఘోస్ట్" ట్రైలర్ యూట్యూబులో సెన్సేషన్ గా మారింది. ఐదు రోజుల్లో ఈ ట్రైలర్ 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను, 208కే లైక్స్ ను సాధించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్రైలర్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ట్రైలర్ కట్టింగ్, నాగ్ స్టైలిష్ ఘోస్ట్ పెర్ఫార్మన్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ... తో ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను ఏర్పరిచింది.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్ లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోతే, ఈ చిత్రం అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాతో నాగ్ బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ ఇవ్వాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa