టాలీవుడ్ లో ఇటీవల చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద సక్సెస్ అందుకున్న మూవీస్ లో జాతిరత్నాలు కూడా ఒకటి. తన అత్యద్భుత దర్శకత్వ ప్రతిభతో అనుదీప్ కెవి ఈ మూవీ తెరకెక్కించి అందరి నుండి మంచి పేరు అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అనుదీప్ శివకార్తికేయన్ తో ప్రిన్స్ అనే మూవీ చేస్తున్నారు. అయితే దానితో పాటు లేటెస్ట్ గా యువ దర్శక ద్వయం వంశీధర్, లక్ష్మి నారాయణ కలిసి తెరకెక్కించిన ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీకి స్టోరీ స్క్రీన్ ప్లే అందించారు అనుదీప్.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 21 ఏళ్ళ క్రితం రిలీజ్ అయి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన ఖుషి మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ కోసం ఒక యువకుడి పోరాటాన్ని సరదాగా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకులు దీనిని తెరకెక్కించారు. ఇక ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరుగగా ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ కొత్త హీరో హీరోయిన్స్ తో దర్శకుడు అనుదీప్, మరియు అతని బృందం కలిసిన చేసిన ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ తప్పకుండా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుటనున్నట్లు తెలిపారు. ఇక ఈ ఈవెంట్ కి తాను రావడానికి ప్రధాన కారణం పూర్ణోదయా సంస్థ అధినేత ఏడిద నాగేశ్వర రావు అని, ఆయనతో వారి కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు మెగాస్టార్.
ఇక ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్స్ కి ఎక్కువగా రావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్న మ్యాటర్ తన వద్దకు కూడా వచ్చిందని, నిజానికి ప్రేక్షకులు ఎంతగా యూట్యూబ్, ఒటిటి వంటివి చూస్తున్నప్పటికీ కూడా ఆకట్టుకునే కంటెంట్ తో మంచి మూవీస్ కనుక మనం వారికి అందించగలిగితే తప్పకుండా వారిని థియేటర్స్ కి రప్పించవచ్చని, ఇటీవల అద్భుతమైన కంటెంట్ తో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన బింబిసార, సీతారామం, కార్తికేయ 2 మూవీస్ అందుకు నిదర్శనం అన్నారు మెగాస్టార్. కాగా ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.