డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది సాయికుమార్ గత కొన్నాళ్లుగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇటీవల యాక్షన్ థ్రిల్లర్ 'తీస్ మార్ ఖాన్'తో వచ్చిన ఆది సాయి కుమార్ ఇప్పుడు ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ 'క్రేజీ ఫెలో'తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న 'క్రేజీ ఫెలో' అక్టోబర్ 14 న థియేటర్లలోకి రానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం ఉదయం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
A fun-filled teaser of Crazy Fellow is Out Now!
In theatres from October 14th.
Link : https://t.co/0F8m0b1Ixv#CrazyFellow pic.twitter.com/aH2Tr6wID8
— Aadi Saikumar (@iamaadisaikumar) September 1, 2022