ఆమిర్ ఖాన్ హీరో గా కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా ఇందులో నాగ చైతన్య ముఖ్యపాత్రలో నటించారు అద్వైత్ చందం డైరెక్టర్ చేయగా ఈ సినిమా తెలుగు లో కూడా రిలీజ్ చేశారు . లాల్ సింగ్ చడ్డా’ భారీ అంచనాల మధ్య ఇటీవల విడుదలై ఫ్లాప్ టాక్ ని మూటకట్టుకుంది. అయితే ఈ చిత్రం 1994లో వచ్చిన హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్ కి రీమేక్ గా తెరకెక్కింది. అసలే బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ నడవడం, దేశాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడాడని అమీర్ పై ఆరోపణలు ఉండడంతో ఈ బాయ్ కాట్ అంశానికి ఆజ్యం పోసినట్లు అయింది. దాదాపు రూ200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అందులోని సగం డబ్బుని కూడా రాబట్టలేకపోయింది అంటే సినిమాపై ఎంతటి వ్యతిరేకత వచ్చిందో అర్థమైతుంది. సినిమా కూడా కొంచెం స్లోగా నడవడం, మతిస్థిమితం లేని యువకుడిని ఇండియన్ ఆర్మీలో చూపించడం లాంటి అంశాలు కూడా సినిమా ఫెయిల్యూర్ కి కారణమని చెప్పవచ్చు.లాల్ సింగ్ చడ్డా ఫుల్ రన్ లో రూ60 కోట్లు మాత్రమే రాబట్టడంతో అమీర్ తన రెమ్యూనరేషన్ ని నిర్మాతల నష్టం పూడ్చడానికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. అయితే అమీర్ ఈ సినిమాకు గాను రూ 50 కోట్లు పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తుంది. అమీర్ మరియు అతడి మాజీ భార్య కిరణ్‌రావ్ ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించారు. దీంతో చూసుకుంటే అమీర్ కి మొత్తంగా వంద కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. ఏదేమైనా తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఏ సినిమాకి సైన్ చేయకుండా చేసినా అమీర్ కి ఈ సినిమా నిరాశే మిగిలిచింది అని చెప్పాలి.