ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT విడుదల తేదీని లాక్ చేసిన 'డేగల బాబ్జీ'

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 01, 2022, 04:32 PM

వెంకట్ చంద్ర దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నటించిన 'డేగల బాబ్జీ' సినిమా మే 20, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ  సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం సెప్టెంబర్ 2 నుండి ఆహా ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుందని ఓటిటి ప్లాట్ఫారం ఇటీవల ప్రకటించారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా డేగల బాబ్జీ OTTలో విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా తమిళ హిట్ చిత్రం ఒత్త సెరుప్పు సైజ్ 7 అధికారిక తెలుగు రీమేక్. యశ్రిషి ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వాతి ఎస్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి లైనస్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa