ఇటీవల తాము విడిపోతున్నట్లు ప్రకటించిన రాజీవ్ సేన్, చారు అపోసా జంట తమ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. తాము తమ వివాహ బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. తామిద్దరికీ ఓ అందమైన పాప పుట్టిందని, ఇక నుంచి పాప పెంపకం, సంతోషమే తమ ప్రాధాన్యత అని వారు తెలిపారు. వీరిద్దరూ మోడలింగ్, సినీ ఇండస్ట్రీలో పేరు సంపాదించారు.