పల్లవి:
చెలియా చెలియా చిరు కోపమా
చాలయ్యా చాలయ్యా పరిహాసము
కోపాలు తాపాలు మనకేల సరదాగా కాలాన్ని గడపాలా
సలహాలు కలహాలు మనకేల.. ప్రేమంటే పదిలంగా వుండాలా
చెలియా చెలియా చిరు కోపమా
చాలయ్యా చాలయ్యా పరిహాసము
చరణం 1:
రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే గాలి తాకంగా పూచెనులే
ఐతే గాలే గెలిచిందననా లేక పువ్వే ఓడిందననా
రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్నా ఉలి తాకంగా వెలిసెనులే
ఐతే ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా
ఈ వివరం తెలిపేది ఎవరంటా వ్యవహారం తీర్చేది ఎవరంటా
కళ్ళల్లో కదిలేటి కలలంటా ఊహల్లో ఊగేటి ఊసంటా
చెలియా చెలియా చిరు కోపమా
చరణం 2:
నీలి మేఘాలు చిరుగాలిని డీకొంటే మబ్బు వానల్లే మారునులే
దీన్ని గొడవెననుకోమననా లేక నైజం అనుకోనా
మౌనరాఘాలు రెండు కళ్ళని డీకొంటే ప్రేమ వాగల్లే పొంగునులే
దీన్ని ప్రళయం అనుకోమననా లేక ప్రణయం అనుకోనా
ఈ వివరం తెలిపేది ఎవరంటా వ్యవహారం తీర్చేది ఎవరంటా
అధరాలు చెప్పేటి కథలంటా హృదయంలో మెదిలేటి వలపంటా
చెలియా చెలియా చిరు కోపమా
చాలయ్యా చాలయ్యా పరిహాసము