టాలీవుడ్ హీరో, 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణుకి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన సూర్య డైరెక్షన్ లో జిన్నా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో డ్యాన్స్ చేస్తుండగా తనకు గాయాలైనట్లు మంచు విష్ణు సోషల్ మీడియాలో తన కాలు ఫోటోను షేర్ చేశారు. 'డ్యాన్స్ చేస్తుండగా నాకు నేనుగా గాయపడతానని అనుకోలేదు, థాంక్యూ ప్రేమ్ రక్షిత్ మాస్టర్' అంటూ విష్ణు పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.