ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పంజాబీ సింగర్ నిర్వేయర్ సింగ్ మృతిచెందాడు. ఆయన కారును వెనుక నుంచి వస్తున్న మరో కారు ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. నిర్వేయర్ సింగ్ సింగర్ గా, ర్యాపర్ గా ఎన్నో రికార్డులు సాధించాడు. నిర్వేయర్ మరణ వార్త విని అతని అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిర్వేయర్ కు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.