ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే ఒక జీవితం ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 02, 2022, 04:06 PM

శర్వానంద్ ఇటీవలే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఒకే ఒక జీవితం  విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు శ్రీకార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన  ట్రైలర్ మరింత ఇంట్రెస్టింగ్‏గా ఉంది. శర్వానంద్ ఏదో మ్యూజిక్ కాంపిటేషన్‏కు ప్రాక్టీస్ చేస్తున్నట్లు ట్రైలర్ ప్రారంభమయ్యింది. అంతలోనే రీతూవర్మ కంగ్రాట్స్ ఆది.. ఫస్ట్ రౌండ్‏లో సెలెక్ట్ అయ్యావు అంటూ మాట్లాడం ఆకట్టుకుంది. అలాగే ఇందులో వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలకపాత్రలలో కనిపించనున్నారు. సీనియర్ నటుడు నాజర్ శాస్త్రవేత్తగా కనిపించనున్నాడు. శర్వానంద్, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ ముగ్గురిని నాజర్ బాల్యంలోకి పంపిస్తాడు. అసలు వీళ్ల గతంలో ఏం జరిగింది . మళ్లీ ఎందుకు గతంలోకి వెళ్లాలనుకున్నారు .  అనేది ఈ సినిమా స్టోరీ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా శర్వానంద్ తల్లిగా అక్కినేని అమల నటింటారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలో సెప్టెంబర్ 9న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa