నిఖిల్ హీరో గా అనుపమపరమేశ్వరి హీరోయిన్ గా జంటగా నటించిన చిత్రం కార్తికేయ2 చందూ మొండేటి దర్శకత్వం లో నిర్వమించిన. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మరీ జెట్ స్పీడులో దూసుకుపోతోంది. ఇలాంటి ఈ టైంలో తన సినిమాను ఓ థియేటర్ నుంచి తీసేయండని చెప్పి అందర్నీ షాక్ చేస్తున్నారు హీరో నిఖిల్. షాక్ చేయడమే కాదు. తను తీసుకున్న ఈ నిర్ణయంతో అందరి మనసులు గెలుచుకున్నారు కూడా. ఎస్ తన సినిమా కార్తికేయ2 ను తీసేసి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ జల్సా సినిమా స్క్రీనింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్న హీరో నిఖిల్ . అందుకోసం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని దేవీ థియేటర్ ఓనర్స్‌తో మాట్లాడారు. వారిని రిక్వెస్ట్ చేసి మరీ సెప్టెంబర్ 1 ,2 న జల్సా సినిమాను స్క్రీనింగ్ చేయాలన్నారు. ఇక ఈ న్యూస్ బయటికి రావడంతో పవన్ ఫ్యాన్స్ నిఖిల్ను తెగ పొగిడేస్తున్నారు. పవన్ సినిమా సంబంర అయిపోయాక.. తన సినిమాను రిపీటెడ్ చేసి నిన్ను నిలబెడతాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa