తాజాగా రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేసి సరికొత్త బజ్ ను క్రియేట్ చేశాడు. రోహిత్ షేర్ చేసిన ఫోటో ఓ సినిమా పోస్టర్ లా కనిపిస్తోంది. ఆ పోస్టర్ లో రోహిత్ ఒంటరిగా హీరో లుక్ లో అందంగా ఉన్నాడు. అంతేకాదు ఆ పోస్టర్ పై ‘మెగా బ్లాక్‌బిస్టర్’ అని రాసి ఉంది. సెప్టెంబర్ ‘4న ట్రైలర్ విడుదల’ అని రాసి ఉంది. రోహిత్ క్యాప్షన్‌లో “నేను కొద్దిగా భయపడ్డాను. ఇదొక అరంగేట్రం.” అనే క్యాప్షన్ ఇచ్చాడు ఆ పోస్టర్ ను షేర్ చేశారు. రోహిత్ శర్మ మాత్రమే కాదు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా అదే టైటిల్ వున్నా ఫోటో ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. , రోహిత్ అలాగే గంగూలీ ఈ ఇద్దరి ఫోటోలకి తేడా ఒక్కటే. గంగూలీ తన ఫొటోని షేర్ చేశారు. వీళ్ళు ఇద్దరే కాదు దక్షిణాది ప్రముఖ నటి రష్మిక మందన్న కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి పోస్టర్‌ను ఒకటి పోస్ట్ చేశారు. రహస్యం ఏమిటంటే: రోహిత్, గంగూలీ ఇద్దరూ షేర్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు వీరిద్దరూ ఏ విషయానికి సంబంధించి పోస్టర్ ను పోస్ట్ చేశారని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. పోస్ట్ చూస్తుంటే ఇద్దరూ ఏదో సినిమాలో నటించడానికి మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు రానున్న రోజుల్లో రష్మికతో రోహిత్ తెరపై కనిపించవచ్చు అంటూ ఊహాగానాలు జోరుగా చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa