ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాయిదా పడిన పృథ్వీరాజ్, నయనతారల 'గోల్డ్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 02, 2022, 05:38 PM

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార అల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వంలో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి 'గోల్డ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. గతంలో మూవీ మేకర్స్ ఈ చిత్రం సెప్టెంబర్ 8, 2022న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ తాజాగా ఇప్పుడు దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ఓనం అయ్యిన ఒక వారం తర్వాత ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా తమిళం మరియు మలయాళంలో సెప్టెంబర్ 15, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ-డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో అజ్మల్ అమీర్, కృష్ణ శంకర్, శబరీష్ వర్మ తదితరులు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ మరియు మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి రాజేష్ మురుగేశన్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com