పాత్రను బట్టి హీరోలు తమ శరీర బరువును తగ్గించుకోవడం, పెంచుకోవడం వంటిది జరుగుతూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ హీరో రణ్ దీప్ హుడా కూడా వీర్ సావర్కర్ బయోపిక్ కోసం 18 కేజీలు బరువు తగ్గాడు. ఈ విషయాన్నే ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 2016లో కూడా సరబ్జిత్ సినిమా కోసం ఆయన 18 కేజీల బరువు తగ్గడం విశేషం. తన పాత్ర కోసం తాను ఎలాగైనా మారుతానని, అప్పుడే అద్భుతంగా నటించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపాడు.