ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరిట సెప్టెంబరు 9న విడుదల కానుంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం జరగాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.