ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న 'ప్రాజెక్ట్ K' సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో స్టార్ హీరోలైన మహేశ్ బాబు, సూర్య, దుల్కర్ సల్మాన్ కూడా కనిపిస్తారని టాక్. ఇప్పటికే ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, దిశాపటానీ లాంటి స్టార్లు నటిస్తున్నారు.