బ్రహ్మాస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. చివరి నిమిషంలో ఈవెంట్ రద్దు చేయడంతో ఎన్టీఆర్ ను చూసే ఛాన్స్ పోయిందని వాపోతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చామని, చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇందులో రాజకీయ కోణం ఉందని,ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నందుకు తొక్కేస్తున్నారని ఓ ఫ్యాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.