తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటించిన సినిమా 'తిరు'. ఈ సినిమాకి మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ సినిమా తమిళం, తెలుగులో ఆగస్ట్ 18న విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మరియు సన్‌నెక్ట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 17 నుంచి తిరు ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.