విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమా 'దాస్ కా ధమ్కీ'. ఈ సినిమాకి హీరో విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో 'ఫలక్‌నుమా దాస్' సినిమాకి దర్శకత్వం వహించి సూపర్ హిట్ కొట్టాడు. తాజాగా మరోసారి ఈ సినిమాలో హీరోగా నటిస్తూ దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని దీపావళికి రిలీజ్ చేస్తాం అని చిత్రం బృందం తెలిపింది. ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాని వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్బ్యానర్లపై నిర్మిస్తున్నారు.