తెలుగు తెరకు ఎస్ఆమ్అస్ చిత్రంతో పరిచయమైన హీరో సుధీర్ బాబు. తన వైవిధ్యమైన కథల ఎంపికతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సుధీర్ బాబు ఇంద్రగంటి మోహన కృష్ణ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. ఈ చిత్రం ఈ నెల 16న విడుదల అవుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచాయి. కాగా సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహన కృష్ణ కలయికలో ఇది మూడో సినిమాగా రానుంది. కృతి శెట్టి సుధీర్ బాబుకు జంటగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మోహనం తరువాత వివేక్ సాగర్ మరోసారి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ బట్టి చూస్తే ఈ మూవీలో హీరో సుధీర్ బాబు సినిమా దర్శకుడి పాత్రలో, హీరోయిన్ కృతి కళ్ళ డాక్టర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఈ సినిమా ట్రైలర్ ని సోమవారం సాయంత్రం గం.5:04 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సమ్మోహనంతో ఆకట్టుకున్న సుధీర్, ఇంద్రగంటి కాంబినేషన్ ఈ చిత్రంతో ఎంతవరకు ఆకట్టుకోగలదో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa