‘ఇషాక్’ అనే బాలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన అమైరా దస్తూర్...ఆ తర్వాత తమిళంలో ధనుశ్ హీరోగా తెరకెక్కిన ‘అనేగన్’ మూవీతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జాకీచాన్ ప్రదాన పాత్రలో నటించిన ‘కుంగ్‌ఫూ యోగా’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది.
ఇక తెలుగులో మహేశ్ అక్క మంజుల దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘మనసుకు నచ్చింది’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ దేవాకట్టా దర్శకత్వంలో ‘ప్రస్థానం’ హిందీ రీమేక్‌లో నటిస్తోంది. తాజాగా ఈ భామా...తనను ఒక స్టార్ హీరో అల్లుడు లైంగింగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. సౌత్‌లో మంచి పలుకుబడి ఉన్న ఆ హీరో పేరు చెబితే నా కెరీర్ నాశనం అవుతుందేమన్న భయంతో ఇపుడా ఆ హీరో పేరు చెప్పను. టైమ్ వచ్చినపుడు ఆ హీరో పేరు బట్టబయలు చేస్తా అని చెబుతోంది.
అంతేకాదు సదరు హీరోతో సినిమా చేస్తున్నపుడు ఆ కథానాయకుడు తనపై చేతులు వేసి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాడని వాపొయింది. ఈ విషయాన్ని సదరు దర్శకుడి దృష్టికి తీసుకెల్లిన తర్వాత తనను మరింత వేధింపులకు గురి చేసారు. దక్షిణాదిలో నాకు సినిమా అవకాశాలు రాకపోయినా పర్వాలేదు కానీ ఆ హీరోను ఒదిలే పెట్టే ప్రసక్తే లేదంటుంది. ఇక అమైరా దక్షిణాదిలో స్టార్ హీరో అల్లుడు అంటే ధనుశ్‌తో మాత్రమే నటించింది. ఇక అమైరా దస్తూర్ చేసిన ఈ వ్యాఖ్యలు రజినీకాంత్ అల్లుడు ధనుశ్‌ను ఉద్దేశించి చేసినవే అనే కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa