భారత్ లో మీ-టు ఉద్యమం మొదలైన వెంటనే ప్రారంభంలో సంచలనాలు సృష్టిస్తుందని అంతా భావించారు. కానీ రానురాను ఇది వ్యక్తుల మధ్య తగాదాలుగా మారింది. వాడుకొని వదిలేశారని కొందరు హీరోయిన్లు, బ్లాక్ మెయిల్ కోసం ఇంకొందరు భామలు ఈ మీ-టును తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దాదాపు ఇదే అర్థం వచ్చేలా మాట్లాడింది బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా.
"నాకెందుకో పెద్ద మార్పు కనిపించడం లేదు. చాలామంది అభిప్రాయాలు వింటున్నాను. మార్పు కంటే రచ్చ ఎక్కువగా జరుగుతోందని నాకనిపిస్తోంది." ముంబయి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఇలా తన అభిప్రాయాల్ని వెల్లడించింది మలైకా. అలా అని తను మీ-టుకు వ్యతిరేకంగా మాట్లాడనని, ఎవరి కష్టాలు వాళ్లకుంటాయని అంటోంది ఈ భామ.
"బాలీవుడ్ విషయానికొస్తే అంతా వ్యక్తుల పైనే ఫోకస్ పెడుతున్నారు. మీ-టు ఉద్యమం వ్యక్తులకు సంబంధించినది కాదు. సమస్యను చూడాలిక్కడ. జనాల మైండ్ సెట్ మారాలి. అది ఒక్క రాత్రిలో సాధ్యమయ్యే పనికాదు."సాజిద్ ఖాన్, అను మాలిక్ లాంటి ప్రముఖులపై వచ్చిన ఆరోపణలపై మలైకా, పైవిధంగా స్పందించింది. ఏదో ఒక వ్యక్తిని ఉద్దేశించి తను మాట్లాడనని, సమస్య గురించి మాట్లాడతానని చెప్పుకొచ్చింది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఇన్ని దశాబ్దాల కాలంలో తనకెప్పుడూ కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురుకాలేదంటోంది మలైకా.
సెట్స్ పై వర్క్ కు సంబంధించిన వాదోపవాదాలు తప్పితే, వ్యక్తిగత స్థాయిలో తనకు ఎవరితో ఎలాంటి అభిప్రాయబేధాలు లేవంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa