ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స‌వ్య‌సాచి కొత్త త‌ర‌హా చిత్ర‌మ‌వుతుంది : చందు మొండేటి

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 30, 2018, 10:50 AM

కార్తికేయ, ప్రేమమ్‌ లాంటి చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభ చూపించారు చందూ మొండేటి. నాగచైతన్య, నిధి అగర్వాల్‌ జంటగా ఆయన రూపొందించిన తాజా చిత్రం సవ్యసాచి. వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌ అనే కొత్త కాన్సెప్ట్‌ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు చందూ. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సవ్యసాచి సినిమా గురించి దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ… ఒక వార్త చదివి తయారు చేసుకున్న కథ ఇది. అంతకు ముందు మరో కథను సిద్ధం చేసుకున్నాను. కానీ వార్తలోని వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌ అనే అంశం కొత్తగా అనిపించింది. ఈ అంశాన్ని కథగా మార్చి నాగచైతన్యకు, నిర్మాతలకు చెప్పాను. అందరికీ బాగా నచ్చి సినిమా ప్రారంభించాం. ఈ చిత్రంలో కథే ప్రత్యేకత. హీరో ఎడమ చెయ్యి తనకు తానే స్పందిస్తుంది. దీంతో హాస్యంతో పాటు కొత్త తరహా భావోద్వేగం కథలో పుట్టింది. చైతన్య ప్రేమ కథా చిత్రాలతో పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇలాంటి కథను ఒప్పుకోవడం గొప్ప విషయం.


 


 ఈ కథకు బలమైన ప్రతినాయకుడు కావాలనుకున్నాం. ముందు నుంచీ మాధవన్‌ గారే నా ఆలోచనలో ఉన్నారు. ఆయన ఏదో కొత్తదనం ఉంటే తప్ప సినిమాలు చేయరు. నేను 45 నిమిషాలు కథ చెప్పగానే నేను చేస్తాను అని మాటిచ్చారు. కీరవాణి గారు సంగీతం కథ ప్రకారం వెళ్తాం అనేప్పటికి చాలా ఆత్మవిశ్వాసం వచ్చింది. కథ ప్రథమార్థం పాత్రలను పరిచయం చేస్తూ వినోదాత్మకంగా వెళ్తుంది. ద్వితీయార్థంలో కొంత తీవ్రత పెరుగుతుంది. దాంతో ప్రేక్షకులకు కొంత రిలీఫ్‌ ఇవ్వాలని లగాయత్‌ పాట పెట్టాం. దర్శకుడికి, హీరోకు కథే ముఖ్యం. అభిమానులకు కొంత హుషారు ఇవ్వాలని నాగార్జున,వెంకటేష్‌ గారిలా హీరో మాట్లాడుతాడు. తప్ప మిగతాదంతా కథలో భాగంగానే వెళ్తుంది. నాకు సహజంగా థ్రిల్లర్‌ తరహా కథలు నచ్చుతాయి. ప్రేమమ్‌ చైతూకి బాగా సరిపోతుందని చేశాను. మున్నా మైఖేల్‌ సినిమా చూసి నిధి అగర్వాల్‌ను తీసుకున్నాం. భూమిక, వెన్నెల కిషోర్‌, రావు రమేష్‌ లాంటి వాళ్ల పాత్రలన్నీ కథలో కీలకంగా ఉంటాయి. కార్తికేయ 2 సినిమాకు కథ సిద్ధంగా ఉంది. కానీ మరికొంత అనుభవం వచ్చాక ఆ సినిమా చేస్తాను. నాగార్జున గారి కోసం ఒక కథ సిద్ధంగా ఉంది. సవ్యసాచి తర్వాత ఆ విషయం ఆలోచిస్తాను. అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa