రష్మిక మండన్నా హిందీలో నటిస్తున్న తొలి చిత్రం "గుడ్ బై" అఫీషియల్ ట్రైలర్ కొంచెంసేపటి క్రితమే విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం ఎంతో సరదాగా, ఉత్కంఠగా సాగింది. ఆకట్టుకునే, అద్భుతమైన ఫ్యామిలీ డ్రామాగా, అక్టోబర్ 7వ తేదీ నుండి ఈ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
వికాస్ బాహ్ల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించారు. శోభా కపూర్, ఏక్తా కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, రష్మిక మండన్నా, నీనా గుప్త, ఆశిష్ విద్యార్థి, సునీల్ గ్రోవర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.