మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన "గాడ్ ఫాదర్" టీజర్ యూట్యూబులో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ కు సంబంచింది ఏ క్షణంలోనైనా అప్డేట్ రావొచ్చంటూ మేకర్స్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, మెగా ఫ్యాన్స్ ఈ అప్డేట్ కోసం వేకళ్ళతో ఎదురు చూస్తున్నారు.
మోహన్ రాజా డైరెక్షన్లో, మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' కు తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ కీరోల్స్ ప్లే చేస్తున్నారు. అలానే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa