సెప్టెంబర్ 16వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతున్న "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" సినిమాకు సంబంధించి నిన్న సాయంత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలయ్యింది. లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వస్తుంది. 24గంటల్లో ఈ ట్రైలర్ కు 6.2 మిలియన్ డిజిటల్ వ్యూస్, 120కే లైక్స్ వచ్చాయి. ఈ సందర్భంగా మేకర్స్ ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ, స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.
ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటించారు. శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలకపాత్రలు పోషించారు.
బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa