2019లో విడుదలైన "నేనే రాజు నేనే మంత్రి" సినిమాతో గ్రాండ్ కం బ్యాక్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ తేజ లేటెస్ట్ గా "అహింస" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ చిత్రంతో దగ్గుబాటి కుటుంబం నుండి అభిరాం హీరోగా పరిచయం కాబోతున్నాడు. సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ ఇటీవలే పూర్తవ్వగా, ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ అఫీషియల్ డేట్ ఫిక్స్ చేసారు. సెప్టెంబర్ 9వ తేదీన 9:09 గంటలకు అహింస నుండి అభిరాం ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa