శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ ఒక ఫామిలీ ఎంటర్టైనర్ మూవీని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో శర్వానంద్ సరసన గ్లామర్ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తుంది. ఈ చిత్రంలో అమల అక్కినేని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి 'ఓకే ఒక జీవితం' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజా అప్డేట్ ప్రకారం, సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్స్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా సెప్టెంబర్ 9, 2022న తెలుగు మరియు తమిళంలో విడుదల కానుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa