ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"కృష్ణ వ్రిoద విహారి" నుండి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 07:07 PM

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, సింగర్ టర్న్డ్ యాక్ట్రెస్ షెర్లీ సెటియా జంటగా నటించిన చిత్రం "కృష్ణ వ్రిoద విహారి". అనీష్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉష మూలుపురి నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ నుండి తార నా తార అనే మెలోడియస్ రొమాంటిక్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు. ఈ పాటను మహతి స్వరసాగర్, నాకాష్ అజీజ్ ఆలపించగా, శ్రీమణి లిరిక్స్ అందించారు.
ఈ చిత్రానికి మహాతి స్వరసాగర్ స్వరాలనందించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 23వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు యువతను ఆకర్షిస్తున్నాయి. నాగసౌర్య స్టైలిష్ లుక్స్, షెర్లీ గ్లామర్ తో ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో తగినంత బజ్ క్రియేట్ అయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa