సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో రూపొందిన చిత్రం "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి". నిన్న సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాగా, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చారు. కొంతమందికి సినిమా ఫీల్డ్ అంటే చులకన భావన ఉంటుందని, ఆ కాన్సెప్ట్ తో ఇంద్రగంటి గారు ఒక అద్భుతమైన సినిమాను తెరకెక్కించారని, తప్పకుండా ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుందని, ట్రైలర్ చూస్తుంటేనే ఆ విషయం క్లియర్ గా అర్ధమవుతుందని తెలిపారు. సెప్టెంబర్ 16వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని ప్రతిఒక్కరు తప్పకుండా థియేటర్లకెళ్ళి చూడమని ఆయన పిలుపునిచ్చారు.
పోతే, ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa